తెలంగాణ గవర్నర్(Telangana Governer) తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundhara Rajan) వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తమిళిసై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. తాను పోటీ చేసే విషయంపై పైనున్న దేవుడు, బీజేపీ(BJP) అధిష్టానం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Governor Tamilisai
తెలంగాణ గవర్నర్(Telangana Governer) తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundhara Rajan) వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తమిళిసై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. తాను పోటీ చేసే విషయంపై పైనున్న దేవుడు, బీజేపీ(BJP) అధిష్టానం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరికి కూడా గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తమిళిసైని పుదుచ్చేరి మీడియా మీరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల గవర్నర్‌గా సమర్థవంతంగా పనిచేస్తున్నానని ఆమె బదులిచ్చారు. ఎంపీ పదవికి పోటీ చేసే విషయమై తనకుతానుగా నిర్ణయం తీసుకోలేనని ఆమె అన్నారు. పైనున్న దేవుడు, బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఇదిలావుంటే.. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై కి సీఎం కేసీఆర్ ప్రభుత్వంతో అస్సలు పడటం లేదు. ఇరుపక్షాలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. తమిళిసై రాజకీయ నేతల వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
