తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ(Telangana)లోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పలువురు ఐఏఎస్ అధికారుల(IAS Officers)ను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanthi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్(Aravind Kumar)ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో పురపాలక ముఖ్యకార్యదర్శిగా దాన కిశోర్(Dhana Kishore)ను నియమించింది. అలాగే ఆయనకు హెచ్‌ఎండీఏ(HMDA), సీడీఎంఏ(CDMA) కమిషనర్‌గా కూడా ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం(Burra Venkatesham) నియమితులయ్యారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిసనర్‌గా కూడా ప్రభుత్వం ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి(Sudharshan Reddy), వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్. శ్రీనివాసరాజు(Srinivas Raju)ను నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా(Rahul Bojja) నియమించడంతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా కూడా ప్రభుత్వం ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది. అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్(Vani Prasad)ను నియమించగా.. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి(Sridevi)కి బాధ్యతలను అప్పగించారు. నల్లగొండ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్(RV Karnan) బదిలీ చేస్తూ.. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్.వి.కర్ణన్‌కు బాధ్యతలు అప్పగించింది.