IPS Officers Transfer : మూడు కమిషనరేట్ల సీపీల బదిలీ..హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణలో(Telangana) కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం పోలీస్ శాఖపై(Police Department) దృష్టి పెట్టింది. కీలకమైన మూడు కమిషనరేట్లకు కొత్త సీపీలను(CP) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రెండు నియామకాలే జరిగాయి. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని(Shivdhar Reddy) నియమించగా..సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీగా(CMO Principal secretery) శేషాద్రిని(Seshadri) అపాయింట్ చేశారు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

IPS Officers Transfer

రాష్ట్ర రాజధాని, కీలకమైన హైదరాబాద్(Hyderabad) సీపీగా 1994 ఐపీఎస్(IPS) బ్యాచ్‌కి చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని(Kotha Kota Srinivas Reddy) నియమించారు. గతంలో గ్రేహౌండ్స్ చీఫ్‌గా పని చేశారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఈ పదేళ్లలో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి లూప్లైన్లోనే ఉన్నారు. ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి ముక్కు సూటి మనిషిగా పేరుంది. అందుకోసమే హైదరాబాద్ సీపీగా ఆయనను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఇక సైబరాబాద్(Cyderabad) పోలీస్ కమిషనర్‌గా ఏకే మహంతి కుమారుడు.. అవినాష్ మహంతిని(Avinash Mahanti) నియమించారు. అవినాష్ మహంతి..ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ సీపీగా(Joint CP) పని చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్రకు ఎలాంటి పోస్టులు ఇవ్వలేదు.
గతంలో రాచకొండ జాయింట్ సీపీగా పని చేసిన సుధీర్ బాబును ..రాచకొండ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ట్రాఫిక్‌లో పని చేస్తున్నారు. ఇప్పటి వరకు రాచకొండ సీపీగా పని చేస్తున్న డిహెచ్ చౌహన్‌ని.. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు హైదరాబాద్ సీపీగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన సందీప్ శాండిల్యను యాంటి నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ గా నియమించారు. మరో ఆరు నెలల్లో సందీప్ శాండిల్య రిటైర్డ్ కాబోతున్నారు. సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి..యాంటీ నార్కోటిక్ బ్యూరోకు ప్రత్యేక డైరెక్టర్ ను నియమించనున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య నియమించినట్టు తెలుస్తోంది.
మొత్తానికి మరికొన్ని రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది.