ఇవాళ అసెంబ్లీ(Assembly) అయిదో రోజు సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి(Srinivas reddy), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలపనుంది. తర్వాత సభలో సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు(White paper) విడుదల చేయనుంది.
ఇవాళ అసెంబ్లీ(Assembly) అయిదో రోజు సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి(Srinivas reddy), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలపనుంది. తర్వాత సభలో సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు(White paper) విడుదల చేయనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) వివరణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసింది. తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవాలన్న బీఆర్ఎస్(BRS) అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ రోజు మరింత వేడిగా శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.