పాఠశాల ఫీజుల నియంత్రణకు ఒక క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావడానికి

పాఠశాల ఫీజుల నియంత్రణకు ఒక క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావడానికి, అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూసేందుకు పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని పాఠశాలలు ప్రతి విద్యాసంవత్సరంలో 10% నుండి 30% వరకు ఫీజులను పెంచుతూ ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న విద్య ఖర్చులను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ చొరవలో భాగం. ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) తరహాలో కొత్త కమిటీ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను చూసుకుంటుంది.

ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్లు ఇప్పటికే ముగియడం.. జూన్ 12 న తెలంగాణ పాఠశాలలు తమ కొత్త సెషన్‌ను ప్రారంభించబోతూ ఉంది. వచ్చే విద్యా సంవత్సరం వరకు ఇది అమలులోకి రానప్పటికీ, ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చే చట్టంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ‘‘ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తాం. ఈ ఏడాది కొత్త నిబంధనలు అమలు కానప్పటికీ 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి" అని ప్రభుత్వ (విద్యాశాఖ) ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు.

Updated On 21 May 2024 8:46 PM GMT
Yagnik

Yagnik

Next Story