తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దం విరామం తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దం విరామం తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆ పార్టీ చివరిసారిగా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పూర్తి బడ్జెట్ సమర్పించింది. బడ్జెట్‌ను జులై 25న ప్రవేశపెట్టనుండగా.. శాసనసభ సమావేశాలు జూలై 23న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ జూలై 23న అంటే సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
ఫిబ్రవరి 10న లోక్‌సభ ఎన్నికల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై 31తో ముగియనున్నందున.. గడువు కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ఆమోదించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.