తెలంగాణలో(Telangana) మద్యం(Alcohol) ధరలు విపరీతంగా పెరగనున్నాయా అంటే అవుననే సమాచారమే వస్తోంది.

తెలంగాణలో(Telangana) మద్యం(Alcohol) ధరలు విపరీతంగా పెరగనున్నాయా అంటే అవుననే సమాచారమే వస్తోంది. బడ్జెట్‌ సమావేశాల(Assembly budget sessions) తర్వాత ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. బడ్జెట్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని గత ఏడాది కంటే అధిక మొత్తంలో అంచనా వేయడంతో మద్యం ధరల పెంపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఆదాయంలో ఎక్కువ భాగం ఎక్సైజ్‌ నుంచే సమకూరుతుందన్న విషయం తెలిసిందే. దాదాపు 10 వేల కోట్ల ఆదాయం వరకు అదనంగా వస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. స్టేట్ ఎక్సయిజ్ సుంకం గత ఏడాది రూ.20,290 కోట్ల ఆదాయం సమకూరిందని, ఈ ఏడాది అదనంగా రూ.5,400 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాలో ఉందని తెలిపారు. ఇక లిక్కర్(Liquor) పై వ్యాట్(VAT) రూపంలో ఆదాయం మరో 4 వేల కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేశారు.

అయితే దసరా పండుగక ముందే ఆ నిర్ణయం తీసుకోనుందా? అంటే ఆదాయ అంచనాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. నిన్న బడ్జెట్‌ తర్వాత హరీష్‌రావు కూడా గత ఏడాది తాను అంచనా వేసిన మద్యం ఆదాయం కంటే అధిక మొత్తంలో ఆదాయం సమకూరుతుందని ప్రస్తుత ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయని అన్నారు. అంటే మద్యం ధరలు కచ్చితంగా పెంచుతారనే అనుమానం తమకు కలుగుతోందని హరీష్‌రావు విమర్శించారు. గత ప్రభుత్వం మద్యం మీదనే ఆధార పడిందని, ప్రజలను కేసీఆర్‌(KCR) ప్రభుత్వం తాగుబోతులను చేస్తుందని విమర్శించిన మీరు.. ఈరోజు మద్యం ద్వారా అధిక ఆదాయం వస్తుందని అంచనా ఎలా వేశారని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో బెల్ట్‌ షాపులు అధికంగా ఉన్నాయని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బెల్ట్‌ షాపులు మూసివేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి(Revanth reddy), ఇప్పటికీ బెల్ట్‌ షాపులు మూసివేయించకపోగా మరిన్ని తెర్చేందుకు ఆస్కారం ఇచ్చారని హరీష్‌రావు(Harish rao) విమర్శించారు.

Eha Tv

Eha Tv

Next Story