ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు రైతు బంధు బందు కానుందా అంటే అవుననే సమాధామనే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది.

ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు రైతు బంధు బందు కానుందా అంటే అవుననే సమాధామనే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. రైతు భరోసా మార్గదర్శకాలు సిద్దం చేసిన తెలంగాణ ప్రభుత్వం. పీఎం కిసాన్(PM Kisan) తరహాలోనే కఠిన నిబంధనలు అమలు చేయాలని యోచిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిదీ ఒకే లెక్కన కట్టి కుటుంబం యూనిట్‌లాగా తీసుకొని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా(Rythu Bharosa) ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించింది. రెండు పంటలకు కలిపి.. ఖరీఫ్, రబీ సీజన్‌లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10,000 పెట్టుబడిగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని రైతులకు గత ప్రభుత్వం ఖాతాల్లో వేసింది. అయితే ప్రస్తుతం సాగుచేసిన భూమికే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను శాటిలైట్‌ సేవలు వినియోగించుకొని సర్వే నెంబర్ల ఆధారంగా రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం కొండలు, బీడు భూములకు కూడా రైతు బంధు(Rythu Bandhu) ఇచ్చిందని.. కానీ ఇప్పటినుంచి పకడ్బందీగా సాగుభూములను గుర్తించి రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక పంటకే ఇస్తారా , రెండు పంటలకు ఇస్తారా అన్నది స్పష్టత ఇంకా రాలేదు.

ehatv

ehatv

Next Story