తెలంగాణలో(Telangana) మద్యం(Alcohol) వినియోగం చాలా ఎక్కువయ్యింది.

తెలంగాణలో(Telangana) మద్యం(Alcohol) వినియోగం చాలా ఎక్కువయ్యింది. ప్రభుత్వమే ప్రజలతో పనిగట్టుకుని మరీ తాగిస్తున్నట్టుగా ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో 12 శాతం మద్యం వల్లనే సమకూరుతున్నదంటే జనం ఎంతగా తాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అమ్ముడయ్యే ప్రతి మూడు విస్కీ బాటిళ్లలో హాఫ్‌ బాటిల్‌ ఒక్క హైదరాబాద్‌లోనే అమ్ముడవుతున్నదట! తెలంగాణలో మద్యం వినియోగం ప్రమాదకరస్థాయిని దాటిపోయిందట! ఇలాంటి స్థాయిని మోడరేట్‌ రిస్క్‌గా భావించవచ్చని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ తెలిపింది. డిస్టిలరీలు, బ్రూవరీల కోసం మద్యం ధరలు(Alcohol Price) పెంచబోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీ వేసింది. ఎక్సైజ్‌ కమిషనర్‌ సభ్యుడిగా ఉండే ఈ కమిటీ తెలంగాణలో మద్యం అమ్మకాలు, వినియోగం మీద ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో పోలిస్తే తెలంగాణలో మద్యం అమ్మకాలు ఊహించినంత స్థాయిలో జరుగుతున్నాయని తేలింది. ఆదాయంలో తెలంగాణనే టాప్‌ ప్లేస్‌లో ఉందని నివేదిక చెబుతోంది. తెలంగాణ ప్రస్తుత జనాభా మూడున్నర కోట్లు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి 35,589 కోట్ల రూపాయల మద్యం విక్రయించారు. అంటే తలసరి మద్యం వినియోగం 9 లీటర్లు అన్నమాట! బీర్ల వినియోగం 10.7 లీటర్లుగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ఇటీవల వెల్లడించిన గణాంకాల్లోనూ మద్యం వినియోగంలో తెలంగాణ టాప్‌ ప్లేస్‌లో ఉందని తేలింది. మద్యం తాగుతున్నవారిలో ఎక్కువ మంది పేదవారు కావడం విషాదం. తెలంగాణలో 43.6 శాతం మంది పురుషులు, 6.7 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారట.

Eha Tv

Eha Tv

Next Story