తెలంగాణ రాజముద్ర(Royal Seal)అంటే అధికారులకు కొంచెం కూడా గౌరవం లేనట్టుగా ఉంది..

తెలంగాణ రాజముద్ర(Royal Seal)అంటే అధికారులకు కొంచెం కూడా గౌరవం లేనట్టుగా ఉంది.. పాలకులే లేనప్పుడు అధికారులకు మాత్రం ఎలా ఉంటుంది లేండి! అందుకే రాజముద్రను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్‌(congress)ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ (Telangana)రాజముద్రను మార్చేస్తామంటూ ప్రకటించింది. అందులో ఉన్నవి రాచరికపు ఆనవాళ్లట! అవి తెలంగాణకు సూటవ్వవట! ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో రాజముద్ర మార్పును తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (Greater Warangal Municipal Corporation)అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. రాజముద్రను తామే మార్చేశారు. పాలకుల మెప్పు పొందవచ్చని భావించారు. ఎల్‌ఆర్‌ఎస్‌(LRS)పై సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హెల్ప్‌ డెస్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సోమవారం హెల్ప్‌ డెస్క్‌ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ రాజముద్ర మార్చేశారు. అధికారిక రాజముద్ర కాకుండా కొత్తగా చేసి పెట్టారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. కేసీఆర్‌(KCR) ప్రభుత్వం వరంగల్‌ చారిత్రక గొప్పదనాన్ని తెలిపేలా రాజముద్రలో కాకతీయ కళాతోరణాన్ని పెడితే, మున్సిపల్‌ కార్పొరేషన్‌ విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. వరంగల్‌ నగర ఔన్నత్యాన్ని తగ్గించేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story