మహిళా కమిషన్ సభ్యులు.. సర్కారు నోటీసులు..!
బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(KTR) రాఖీలు(Rakhi) కట్టిన మహిళా కమిషన్(Women Commission) సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు(Notices) ఇచ్చింది. తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట శనివారం హాజరైన కేటీఆర్‌ను సోదరుడిగా భావించి కమిషన్ సభ్యులు దట్టి, రాఖీలు కట్టారు. కేటీఆర్‌కు ఆరుగురు సభ్యులు రేవతిరావు, అఫ్రోజ్ షాహీనా, గజ్జెల పద్మ, ఉమాయాదవ్, సూదమ్ లక్ష్మి, కొమ్రు ఈశ్వరి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. కేటీఆర్‌కు కార్యాలయంలోనే రాఖీ కట్టడంపై కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద(Nerella Sharada) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె ఆదేశం మేరకు కమిషన్ కార్యదర్శి ఆ ఆరుగురు సభ్యులకు నోటీసులు ఇచ్చారు. చిత్రమేమిటంటే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద మాత్రం సీఎం రేవంత్‌రెడ్డికి(CM Revanth reddy) రాఖీపౌర్ణమి రోజు రాఖీ కట్టారు. ఇది తప్పు కాన్నప్పుడు కేటీఆర్‌కు రాఖీలు కట్టడం ఎలా తప్పు అవుతుందని బీఆర్‌ఎస్ మహిళా నేతలు అంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని చెబుతున్నారు.