దివ్యాంగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆసరా పెన్షన్లను 4016 రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పెన్షన్ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం ఉత్తర్వులలో తెలిపింది.

Telangana government hikes pension for differently-abled to Rs 4016 per month
దివ్యాంగుల(Differently-Abled)కు (తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) గుడ్‌న్యూస్(Good News) చెప్పారు. ఆసరా పెన్షన్ల(Asara Pension)ను 4016 రూపాయలకు పెంచుతూ(Hike) ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పెన్షన్ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం ఉత్తర్వులలో తెలిపింది. గతంలో దివ్యాంగుల పెన్షన్ 3016 ఉండగా.. రూ.4016 కు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు పెన్షన్లను పెంచారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలుగనుంది. పెన్షన్ల పెంపు(Pension Hike)పై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు(Finance Minister Harish Rao) హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016కు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పెంపు బీఆర్‌ఎస్ ప్రభుత్వ(BRS Govt) పనితీరుకు నిదర్శనమన్నారు.
