తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 180 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 10, 375 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 20, 750 మిల్లిలీటర్‌బాటిల్‌పై రూ. 40ను ప్రభుత్వం తగ్గించింది. బీరు ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపులు జరగలేదు.
తెలంగాణ(Telangana)లో మద్యం(Liquor) ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 180 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 10, 375 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 20, 750 మిల్లిలీటర్‌బాటిల్‌పై రూ. 40ను ప్రభుత్వం తగ్గించింది. బీరు ధర(Beer Rates)ల్లో మాత్రం ఎలాంటి తగ్గింపులు జరగలేదు. అయితే ఈ తగ్గించిన ధరలు సోమవారం నుంచి కొత్తగా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లపై వర్తిస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గజ్జెల నాగేశ్(Gajjela Nagessh) వెల్లడించారు. కొన్ని బ్రాండ్స్ మద్యం అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం లిక్కర్ ధరలు తగ్గించినట్లు అబ్కారీ అధికారులు స్పష్టం చేశారు.