తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని తీసుకుని వచ్చారు. ఈ హామీ అమలు కారణంగా ఆటో డ్రైవర్ల మీద తీవ్ర ప్రభావం పడింది.

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారం లోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని తీసుకుని వచ్చారు. ఈ హామీ అమలు కారణంగా ఆటో డ్రైవర్ల మీద తీవ్ర ప్రభావం పడింది. ఆటోలలో కనీసం ఎక్కేవాళ్ళు లేకుండా పోయారాంటూ ఆటో డ్రైవర్లు(Auto Drivers) కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి తామేమీ వ్యతిరేకం కాదని.. కేవలం తమకు ఉపాధి లేకుండా పోతుందనే బాధ తప్ప మరొకటి లేదని చెబుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని.. తమను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఆటోడ్రైవర్లను ఆదుకోడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అసెంబ్లీలో ప్రకటించినట్లుగా ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ఏడాదికి ఆటోడ్రైవర్లకు 12 వేలు ఇస్తామని అన్నారు. వచ్చే బడ్జెట్‌లో ఈ హామీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతిపక్ష సభ్యులకు వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఆటోడ్రైవర్లకు కనీసం వెయ్యి రూపాలైనా సహాయం చేశారా అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు.

Updated On 9 Feb 2024 11:08 PM GMT
Yagnik

Yagnik

Next Story