భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపాన్ని తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపాన్ని తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ సందర్భగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభనాయకుడి హోదాలో మొదటి ప్రసంగాన్ని ఇచ్చారు. ఆయన మన్మోహన్ సింగ్ ను సరళీకృత ఆర్థిక విధానాలను దేశంలో ప్రవేశ పెట్టి, భారత ఆర్థిక పురోగతికి తొడద్దారు అని చెప్పారు.
ఆయన పెద్దలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు చేపట్టారు అని చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని గుర్తు చేశారు. నీతి నిజాయితీలకు ఆయన మారుపేరు అని.. ఈ తరానికి ఆయన రోల్ మోడల్ అని చెప్పారు. ఆక్సిడెంటల్ ప్రైమినిష్టర్. మౌన ముని అనే విమర్శలు ఎదుర్కొన్నా ఆయన సంయనం కోల్పోకుండా దేశ అభివృద్ధి కోసం పనిచేసారు అని చెప్పారు.
ఈ సందర్భగా మన్మోహన్ సింగ్ కు తనతో ఉన్న అనుభవాలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ధర్నాలో మొదటిసారి సభకు వెళ్ళిన మాతో ఆయన పాల్గొనడం ఆయన నిరాడంబరత, భేషజాలు లేని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలిపారు. మన్మోహన్ కు, జైపాల్ రెడ్డి కి ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ తెచ్చిన భూ సేకరణ చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడింది అని చెప్పారు.
ఇంత ప్రభావితం చేసిన మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ లో ఆయన గుర్తుగా మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని.. ఆయన జయంతి , వర్ధంతి లను జరుపుకోవాలని ఆయన అన్నారు.