తెలంగాణలో(Telangana) మిలాద్ ఉన్ నబీ(Milad un Nabi) వేడుకలకు ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒవైసీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 28న రాష్ట్రంలో మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి రెండూ జరుపుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో పండుగలు జరుపుకునే సమయంలో శాంతిభద్రతలను కాపాడుకోవడం తప్పనిసరి అని అన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొందరు దుర్మార్గులు సమాజంలో ఉన్నారన్నారు. అయితే.. రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు తెలంగాణ ప్రజలు ఎవరినీ అనుమతించరని నాకు తెలుసు అని అన్నారు.

మిలాద్ ఉన్ నబీ ర్యాలీకి(Rally) సంబంధించి అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలగకుండా తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మిలాద్ ఉన్ నబీకి సెలవు(Holiday) ప్రకటించింది. అంతేకాకుండా ఈ నెలలో తెలంగాణలో అర్బయీన్, శ్రీకృష్ణ అష్టమి, వినాయక చవితికి ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. ఈ సంవత్సరం, అర్బయీన్ సెప్టెంబర్ 6 న వస్తుంది. సెప్టెంబర్ 7న‌ శ్రీ కృష్ణ అష్టమి, 18న వినాయక చతుర్థి జరుపుకుంటారు.

Updated On 4 Sep 2023 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story