రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది సర్కార్. ప్రభుత్వ ఆఫీసుల్లోనే కాదు.. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఈ 8న సెలవు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతి ఏటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం మహిళా […]
రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది సర్కార్. ప్రభుత్వ ఆఫీసుల్లోనే కాదు.. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఈ 8న సెలవు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతి ఏటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తోంది. ఈ సారి కూడా అలాగే సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 8న హోలీ పండుగ రోజున విద్యాసంస్ధలకు సెలవు ప్రకటిస్తూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఇదే రోజు ఉమెన్స్ డే ఉండటంతో.. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది.