మందు బాబులకు షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం సిద్ధమైంది.

మందు బాబులకు షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలు(alcohol prices) పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీరుపై(Beer) రూ.20, లిక్కర్‌పై(Liquor) రూ.20 నుంచి 70 వరకు పెంచేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ప్రతినెలా రూ.1000కోట్లు అదనంగా ఆదాయం వచ్చేందుకు ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలతో సమానంగా ఇక్కడ ధరలు పెంచాలని తద్వార ఇరు రాష్ట్రాల్లో మద్యం సరఫరా ఉండదని భావిస్తున్నారు. మరోవైపు అనుకున్నంత ఆదాయం మద్యంపై రాకపోవడం లేదని ప్రభుత్వం నిరాశచెందుతోంది. రాష్ట్రంలో గుడుంబా సహా అక్రమ మద్యం తయారీ పెరిగిపోయిందని.. గతేడాది మొదటి ఆరు నెలల్లో 9,108 కేసులు నమోదుకాగా ఈ ఏడాది తొలి ఆరునెలల్లో అంతకురెట్టింపుగా 18,826 కేసులు నమోదు కావడమే అక్రమ మద్యం తయారీకి ఉదాహరణ. అక్రమ మద్యం అరికట్టేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం మద్యం ద్వారా రూ.36 వేల కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటికి 17 వేలకోట్లు వచ్చిందని.. మిగిలిన ఆరు నెలల్లో కూడా మరో 17 వేల కోట్లు వస్తుందని.. దీంతో మద్యం ఆదాయం 35 వేల కోట్లకే పరిమితం కానుంది. దీంతో మద్యం ధరలు పెంచి మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది

Eha Tv

Eha Tv

Next Story