Congress Party : సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తుందా..!
తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Government) కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ఆరు గ్యారెంటీల అమలు హామీతో కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆరు గ్యారెంటీల్లో పరిమితంగా డబ్బు ఖర్చయ్యే హామీలను ముందుగా అమలు పర్చింది. ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం(Free RTC Bus), ఆరోగ్య శ్రీ పథకంలో(Arogyashri) ఇప్పటివరకు ఉన్న పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ అనేది ఒక గ్యారెంటీ.
తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Government) కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ఆరు గ్యారెంటీల అమలు హామీతో కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆరు గ్యారెంటీల్లో పరిమితంగా డబ్బు ఖర్చయ్యే హామీలను ముందుగా అమలు పర్చింది. ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం(Free RTC Bus), ఆరోగ్య శ్రీ పథకంలో(Arogyashri) ఇప్పటివరకు ఉన్న పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ అనేది ఒక గ్యారెంటీ. ఇందులో మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నాయి. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మరో గ్యారెంటీ 'చేయూత'లో ఉన్న రూ.4 వేల పెన్షన్.. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు ఉంది. ఇందులో ఆరోగ్య శ్రీ పరిధి పెంపును అమల్లోకి తీసుకొచ్చింది.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు(Financial Problems) ఉన్న విషయం వాస్తవమే. ఈ సంగతి ఇప్పటి అధికారపక్షం, అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్‌కు తెలుసు. అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీలు ఇచ్చింది. ఈ ఆరు గ్యారెంటీలు సహా 40 పేజీలకు పైగా ఉన్న మేనిఫెస్టోలో స్పష్టమైన హామీలు ఇచ్చింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని.. కౌలు రైతులకు(Farmers) కూడా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నామని అదే రోజు.. రెండు లక్షల రుణమాఫీ, రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా గాంధీభవన్ సహా ఎన్నికల సభలల్లో ప్రకటించారు. వచ్చే నెల నుంచి పెన్షన్ 2 వేల నుంచి 4 వేలకు పెంచుతామని పలు సందర్భాల్లో హామీలు ఇచ్చింది కాంగ్రెస్.
అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ముందున్న సవాళ్లు ఏంటంటే రైతుభరోసా(Rythu Barosa) కింద ఇస్తామన్న డబ్బుల సమకూర్చుకోవడమే. పాత పద్ధతిలోనే ఖాతాల్లో జమ చేయాలంటే దాదాపు 11 వేల కోట్లకుపైగా జమచేయాల్సి ఉంటుంది. దీనికి తోడు కౌలు రైతులను గుర్తించడం. అసలు కౌలు రైతులను ఏ ప్రాతిపదికగా గుర్తిస్తారు.. వారికి రైతుభరోసా కింద ఎకరానికి 15 వేలు ఎలా ఇస్తారనేది సమస్యగా మారింది. భూమి లేని రైతు.. ఇతరుల దగ్గర భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తారు.. ఈ క్రమంలో రైతుభరోసా అసలు రైతుకు ఇస్తారా.. లేదా కౌలు రైతుకు ఇస్తారా.. అసలు రైతుకు ఇస్తే కౌలుదారుడికి ఈ బంధు దక్కదు. అసలు రైతు దగ్గర కౌలుదారుడు ఒప్పంద పత్రం తీసుకొని అధికారులకు అందజేయాలని షరతు పెడితే.. అసలు భూమి ఉన్న రైతు ఆ ఒప్పంద పత్రాన్ని కౌలు రైతుకు ఎలా ఇస్తాడు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కౌలు అంగీకార పత్రం తీసుకెళ్తే అసలు రైతుకు రైతు భరోసా పడదు కదా అనే ఆందోళన ఉంది. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారబోతుంది. ఇద్దరికీ ఇవ్వాలనుకుంటే.. ఒకే పొలానికి రెండు సార్లు రైతుభరోసా ఎలా వర్తింపజేస్తారు. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న అసలు చిక్కు.
మరో ఉదాహరణ చూస్తే ఓ రైతు దగ్గర రెండు ఎకరాల పొలం ఉందనుకుందాం.. అతను మరో రైతు దగ్గర రెండు ఎకరాలు కౌలుకు తీసుకుంటాడు. ఈ క్రమంలో ఈ రైతులను అసలు రైతు అనాలా.. కౌలు రైతు అనాల అన్న సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. రైతుభరోసాకు లిమిట్ పెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు. వందల ఎకరాలున్న రైతులకు రైతుబంధు ఎలా ఇస్తారని గత ప్రభుత్వ హయాంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ లిమిట్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారు, ప్రభుత్వ ఉద్యోగులకు భూమి ఉంటే రైతు భరోసా వర్తింపచేయకూడదని చర్చ నడుస్తోంది. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి 5 ఎకరాల వరకే ఈ రైతుభరోసాను వర్తింపచేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. దీనికి తోడు నిధుల సమకూర్పు ప్రభుత్వం ముందున్న సవాల్.
డిసెంబర్ 9న నాడు నేను వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని.. కేసీఆర్(KCR) సర్కార్ రుణమాఫీ చేసినా కూడా.. వెంటనే బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రుణం తెచ్చుకుంటే.. నేను వచ్చినరోజే ఆ నిధులు జమచేస్తానని స్వయంగా రేవంత్‌రెడ్డి చెప్పడంతో రుణమాఫీపై రైతులు ఆశతో ఉన్నారు. రెండు లక్షల రుణమాఫీకి దాదాపు 20 వేల కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయి. ఈ క్రమంలో రుణమాఫీ కొద్దిగా ఆలస్యమైనా కూడా.. రైతుభరోసా నిధులు ఇంకా జమచేయడం లేదని.. సీజన్ ప్రారంభమైందని పెట్టుబడి కోసం రైతుభరోసా నిధులు జమచేయాలని వారు కోరుతున్నారు. తొలుత 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుభరోసా వేసి.. ఆ తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మరో ముఖ్యమైన సవాల్ ప్రభుత్వానికి రాబోతుంది. 'రైతులారా.. మీరు వడ్లు అమ్ముకోకండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొంటాం' ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ. పంట దిగుబడి వచ్చింది. రైతుల దగ్గర ధాన్యం రాసులు కుప్పలు, కుప్పలుగా ఉన్నాయి. గత ప్రభుత్వం మాదిరిగానే ఐకేపీ కేంద్రాలు పెట్టి వడ్లు కొంటుందా.. ఎన్ని క్వింటాళ్లకు 500 బోనస్ అదనంగా ఇస్తారు. రైతు దగ్గర ఉన్న వడ్లన్నీ కొంటారా.. లిమిట్ పెడతారా అన్న మీమాంస నెలకొంది. వడ్లకు క్వింటాల్‌కు అదనంగా 500 రూపాయలిస్తే కేంద్రం కొర్రీలు వేసే అవకాశం ఉందని.. దీనిని ప్రభుత్వం ఎలా అధిగమిస్తోందో చూడాలి.