సంధ్య థియేటర్ వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటపై అల్లు అర్జున్ టీమ్ స్పందించారు.

సంధ్య థియేటర్ వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటపై అల్లు అర్జున్ టీమ్ స్పందించారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్.. సంధ్య థియేటర్లో(SandhyaTheatre) జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం అని.. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని తెలిపింది. మరోవైపు పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట పై కేసు నమోదయ్యింది. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్‌ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌, ఆయన సెక్యూరిటీ, థియేటర్‌ యాజమాన్యంపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రీమియర్‌ షోకు అల్లు అర్జున్‌ వస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని డీసీపీ(DCP) స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఇకపై తెలంగాణలో బెన్‌ఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలిపారు. తెలంగాణలో ఇక నుంచి ప్రీమియర్ షోలు, బెన్‌ఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ehatv

ehatv

Next Story