ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర గోదావరి పుష్కరాలకు(Godavari Pushkaralu) ముహూర్తం ఖరారైంది.
ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర గోదావరి పుష్కరాలకు(Godavari Pushkaralu) ముహూర్తం ఖరారైంది. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నందున ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముందస్తుగా చేపట్టాల్సిన పనులను నిర్ణయించారు. ఈ సారి గోదావరి పుష్కరాలు ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2027 జులై 23 నుంచి ఆగస్ట్ 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభ సమయంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబుకు(Chandrababu) అపకీర్తిని తెచ్చిపెట్టాయి. దీంతో ఈ సారి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈసారి పుష్కరాలకు 8 కోట్ల మంది వస్తారని భక్తులు అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటి నుంచే పనులు చేస్తే కానీ అప్పటి వరకు పూర్తి కావని ముందస్తుగానే పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు.
అంచనా వేశారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమండ్రి పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి రూ.456, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సిటీ బ్యూటిషికేషన్, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లాను యూనిట్‌గా తీసుకొని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు.