హోలీ పండుగ తెలంగాణతో సహా భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతోనూ ఆనందంతోనూ జరుపుకుంటారు

భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకునే హిందువుల పండుగలో హోలీ ఒకటి. తాజాగా హోలీకి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 25వ తేదీ సోమవారం పండుగకు సెలవు ప్రకటించారు. హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. రాష్ట్రంలోని పాఠశాలలకు సోమవారం కూడా సెలవు ఇవ్వనున్నారు. ప్రస్తుత నెలలో, మరో రెండు సెలవులు ఉన్నాయి. వాటిలో ఒకటి సాధారణ సెలవుదినం.. మరొకటి ఐచ్ఛిక సెలవుదినం. గుడ్ ఫ్రైడే కారణంగా మార్చి 29 సాధారణ సెలవుదినం కాగా.. షహదత్ హజ్రత్ అలీ కారణంగా మార్చి 31 ఐచ్ఛిక సెలవు ప్రకటించారు.

హోలీ పండుగ తెలంగాణతో సహా భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతోనూ ఆనందంతోనూ జరుపుకుంటారు. హోలీ భారతదేశంలో వసంతం ఆగమనాన్ని, శీతాకాలం ముగింపును గుర్తుగా జరుపుకుంటారు. పండుగ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మార్చి 25న సార్వత్రిక సెలవు ప్రకటించింది.

Updated On 17 March 2024 9:55 PM GMT
Yagnik

Yagnik

Next Story