ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే పులి సంచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని అధికారులు స్పష్టం చేశారు. చిరుత పులికి సంబంధించిన సమాచారం కూడా గుర్తించలేదని తెలిపారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎం.సీ.పర్గెయిన్ జిల్లా అటవీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
నల్లగొండ(Nalgonda) జిల్లా నార్కెట్ పల్లి(Narketpalle) మండలంలో పులి(Tiger) కనిపించిందనే ప్రచారం వాస్తవం కాదని అటవీ శాఖ(Forest Department) తెలిపింది. ఈ ప్రాంతంలో పులి సంచారానికి అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే పులి సంచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని అధికారులు స్పష్టం చేశారు. చిరుత పులికి సంబంధించిన సమాచారం కూడా గుర్తించలేదని తెలిపారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎం.సీ.పర్గెయిన్ జిల్లా అటవీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో పులి సంచరించే అవకాశం లేదని అటవీ అధికారులు తెలిపారు. కొందరు పక్క రాష్ట్రాలకు చెందిన పులి సంచారం వీడియోలను ఈ ప్రాంతానికి చెందినదిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తలను నమ్మవద్దని అటవీ శాఖ అధికారులు కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా పులితో పాటు, వన్యప్రాణుల సంచారం తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు
18004255364 కు ఫోన్ చేయాలని, లేదా స్థానికి అధికారులకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ కోరింది.