ఇవాళ పెత్తరామవాస్య(Pattaramavasya).. బతుకమ్మ పండుగ(Bathukamma festival) సంబరాలు ప్రారంభవుతున్న రోజు.

ఇవాళ పెత్తరామవాస్య.. బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభవుతున్న రోజు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం కానున్న ఈ వేడుకలు పది రోజుల పాటు కొనసాగుతాయి. అతివల అస్తిత్వానికి అద్దం బతుకమ్మ పండుగ. బతుకు అంటే జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. అంటే.. జీవితమంతా సంతోషకరంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడడం సంప్రదాయం. దేవుళ్లను పువ్వులతో పూజించడం సహజం. కానీ పువ్వులనే దేవుళ్లుగా కొలిచే పండుగ ఒకటి ఉంది. అదే మన తెలంగాణ బతుకమ్మ పండుగ. ఇలా పువ్వులను పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఈ రోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి...ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి.. చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక. బతుకు అమ్మా..అని దీవించే పండుగ ఓ దంపతులకు పిల్లలు పుట్టినట్లే పుట్టి చనిపోతున్నారు. దీంతో బిడ్డల కోసం పార్వతీ దేవిని ప్రార్థించారు. ఆమె కరుణతో వారికి ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆమెను వారు బతుకు అమ్మా అని ఆశీర్వదించి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అలా ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోగా..బతుకు అమ్మా అని ఆశీర్వదించటంతో ఆమె బతికింది కాబట్టి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారట! గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. పువ్వులతో పాటు.. పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. దుర్గరూపంగా.. బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మా (జీవించు అని అర్థం).. మాకు బతుకునీయవమ్మా (మమ్మల్ని చల్లగా చూడు తల్లీ) అని పాటలతో అమ్మను వేడుకుంటారు...

Eha Tv

Eha Tv

Next Story