తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఆయన్ను అడిగితే.. ఆయన చాలా తెలివిగా ఒకరి పేరంటూ చెప్పకుండా తప్పించేసుకున్నారు. జగన్ తనకు అన్నలాంటి వాడని, లోకేశ్ తనకు స్నేహితుడని, చంద్రబాబు చాలా పెద్దవారని, పవన్ కల్యాణ్ కూడా అన్న వంటి వాడని అన్నారు. అంతా తమకు కావాల్సిన వారేనని కేటీఆర్ చెప్పేసారు. ఎవరు గెలిచినా... ఆంధ్రాప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అక్కడ హోరాహోరీగా కనిపిస్తోందని, అందరూ తన స్నేహితులేనని.. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని కేటీఆర్ అన్నారు ఆంధ్రా ప్రజలు మాకంటే.. తెలంగాణ ప్రజల కంటే తెలివైన వారని, వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు.
అక్కడ ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారని ప్రశ్నించగా... అలా చెప్పేందుకు తనకు ఏపీలో ఓటు హక్కు లేదని సరదాగా వ్యాఖ్యానించారు.తాము తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పామన్నారు. అందుకే హైదరాబాద్ ప్రాంతంలో ప్రత్యర్థులకు ఒక్క సీటు రాకుండా అన్నీ బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. విభజన వికాసానికే కాబట్టి ఏపీ, తెలంగాణ బాగుండాలన్నారు.