లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి బీఆర్‌ఎస్ అధినేత బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మే 10వ తేదీ వరకు ఈ బస్సుయాత్ర కొనసాగనుంది. తెలంగాణలోని పలు ప్రాంతాలలో కేసీఆర్ పర్యటన చేపట్టనున్నారు.
17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై.. సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది. వేసవి కావడంతో సాయంత్రం 5.30 గంటల తర్వాత ఈ రోడ్ షోలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 నుంచి ఏడు గంటల మధ్య రోడ్ షోలు ఉండనున్నాయి. మిగతా సమయాల్లో రైతులను, వివిధ వర్గాల వారిని కలిసేలా బీఆర్ఎస్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలలో 25న భువనగిరిలో, 26న మహబూబ్‌నగర్‌లో, 27న నాగర్‌కర్నూల్‌లో, 28న వరంగల్‌లో, 29న ఖమ్మంలో, 30న తల్లాడ, కొత్తగూడెంలలో, మే 1న మహబూబాబాద్‌లో, మే 2న జమ్మికుంటలో, మే 3న రామగుండంలో, మే 4న మంచిర్యాలలో, మే 5న జగిత్యాలలో, మే 6న నిజామాబాద్‌లో, మే 7న కామారెడ్డి, మెదక్‌లలో, మే 8న నర్సాపూర్, పటాన్‌చెరులలో, మే 9న కరీంనగర్‌లో, మే 10న సిరిసిల్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీనే సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.