తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత, శాసనసభ పక్షనేత కె.చంద్రశేఖర్‌రావు చాలా వరకూ పార్టీ విషయాలకు దూరంగానే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన ఆసుపత్రి పాలవ్వడంతో ఆయన మునుపటిలా రాజకీయ కార్యక్రమాల్లో భాగం అవ్వలేకపోయారు. అయితే కేసీఆర్ మంగళవారం తెలంగాణభవన్‌కు రానున్నా రు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై […]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత, శాసనసభ పక్షనేత కె.చంద్రశేఖర్‌రావు చాలా వరకూ పార్టీ విషయాలకు దూరంగానే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన ఆసుపత్రి పాలవ్వడంతో ఆయన మునుపటిలా రాజకీయ కార్యక్రమాల్లో భాగం అవ్వలేకపోయారు. అయితే కేసీఆర్ మంగళవారం తెలంగాణభవన్‌కు రానున్నా రు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు రావాలని అధినేత ఆదేశించారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉన్న సంగతి తెలిసిందే!! కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు కూడా సిద్ధమైంది. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ త్వరలో నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభ విషయంలో కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. దాదాపు రెండు నెలలుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల రాజకీయంగా యాక్టివ్ గా మారారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ ఎదురుదాడికి సిద్ధమవుతూ ఉన్నారు. పార్టీ వర్గాలను కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు.

Updated On 5 Feb 2024 9:42 PM GMT
Yagnik

Yagnik

Next Story