ఈ వేడుకలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయని, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు,
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించనున్నాయి. ఫిబ్రవరి 17న ఆయన 70వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా 1000 మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య బీమా పత్రాలు ఇవ్వనున్నారు. ఇక వికలాంగులకు వీల్‌ఛైర్స్ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
ఇక కేసీఆర్ ఘనతను వివరిస్తూ ‘తానే ఒక చరిత్ర’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని ఈ వేడుకల సందర్భంగా ప్రదర్శిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల కేక్‌ను పార్టీ కార్యాలయంలోనే కట్ చేయనున్నారు. ఈ వేడుకలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయని, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొననున్నారు.