కొడంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్శించే విధంగా ఉంటాయి. ఈ సారి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజల దృష్టి కొడంగల్‎వైపే ఉండనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్‎లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొడంగల్ పీసీసీ(PCC) చీఫ్ రేవంత్‎రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఇప్పుడు దీనిపైనే ఉంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టుగా..

తెలంగాణలోనే(Telangana) హాట్ సీట్లల్లో ఒకటి కొడంగల్ నియోజకవర్గం(Kodangal Constituency). ఒకవైపు గులాబీ దళం జోరు పెంచగా..మరోవైపు తగ్గేదే లేదంటున్నారు రేవంత్‎రెడ్డి(Revanth Reddy). కొడంగల్‌లో రేవంత్‎రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా..నరేందర్‎రెడ్డి(Narender Reddy) సత్తా చాటతారా? ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న రేవంత్‎రెడ్డి..కొడంగల్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. కొడంగల్‌లో బీజేపీకి(BJP) అనుకూల పరిస్థితులు లేకపోవడంతో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే చర్చ ఊపందుకుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతకీ కొడంగల్‎లో‎ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓటర్ల నాడీ ఎలా ఉంది? ఇప్పుడు మీ నియోజకవర్గం..

మా విశ్లేషణలో చూద్దాం.

కొడంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్శించే విధంగా ఉంటాయి. ఈ సారి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజల దృష్టి కొడంగల్‎వైపే ఉండనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్‎లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొడంగల్ పీసీసీ(PCC) చీఫ్ రేవంత్‎రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఇప్పుడు దీనిపైనే ఉంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టుగా..ఓడిన చోటే మళ్లీ తీరాలనే పట్టుదలతో రేవంత్‎రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొడంగల్ నుంచే మళ్లీ బరిలోకి దిగేందుకు రేవంత్‎రెడ్డి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించిన పట్నం నరేందర్‎రెడ్డిపై ఈసారి రేవంత్‎రెడ్డి గెలుస్తారా? ఈసారి కొడంగల్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొడంగల్ పేరు చెప్పగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే గుర్తుకొస్తారు. అలాంటిచోట రేవంత్‌కు చెక్ పెట్టి, అంచనాలకు అందకుండా గులాబీ దళం గెలుపు జెండా ఎగరేసింది. మరి ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి ఉందా? ఈసారి అక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొడంగల్‌పై రేవంత్‎రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా? పట్నం నరేందర్‎రెడ్డి మరోసారి గెలిచి సత్తా చాటుతారా? ఇదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కర్ణాటక సరిహద్దుల్లో(Karnataka Border) ఉన్న కొడంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటిదాకా 16సార్లు అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరిగాయి. మొదట్లో ఇక్కడ కాంగ్రెస్‌(Congress) హవా నడిచింది. టీడీపీ(TDP) ఆవిర్భావంంతో రెండు పార్టీల మధ్య వార్‌ నడిచేది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ట్రయాంగిల్‌ పోరు మొదలైంది.
ఇప్పటివరకు ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తొలిసారి 2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్‎రెడ్డిని గెలిపించారు. కొడంగల్ నియోజకవర్గంలో బొంరాస్‌పేట్, దూద్యాల్, దౌల్తాబాద్, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్, మద్దూర్ మొత్తం 8 మండలాలున్నాయి. మొత్తం 2 లక్షల 16 వేల మందికిపైనే ఓటర్లున్నారు. మొదటి నుంచి తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతంగా కొడంగల్‌కు పేరుంది. రాష్ట్రానికి మారుమూలన ఉండే ఈ ప్రాంతం ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.

రాష్ట్ర సరిహద్దులో విసిరేసినట్టుండే కొడంగల్‌ నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య ప్రధానమైంది. పాలమూరు-రంగారెడ్డి, కొయిల్ సాగర్-నారాయణపేట ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఈ రెండు ఇంతవరకూ పూర్తి కాలేకపోవడంతో ఇక్కడి ప్రజలు నిరాశతో ఉన్నారు. దీనిపై విపక్షం విమర్శలు ఒకలా ఉంటే… అధికారపక్షం వాదనలు మరోలా ఉంటున్నాయి. కొడంగల్‌కు అభివృద్ధితో కొత్తరూపు తీసుకొచ్చామని అధికారపక్షం చెబుతోంది. 80 శాతం బిటీ రోడ్లు పూర్తి చేయడం, ఇంటింటికి తాగునీరందించడం, స్టేడియం, పార్కుల నిర్మాణం చేపట్టడంతోపాటు 40 ఎకరాల్లో ఐటి పార్కు ఏర్పాటు కోసం ప్రపోజల్స్ కూడా పంపామని అధికారపక్షం చెబుతుంటే..విపక్షం మాత్రం దానికి భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. కోస్గీలో చిరు వ్యాపారుల కోసం మినీ ఫుడ్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేసినా అది నిరుపయోగంగా మారింది. చెత్త చెదారంతో నిండి, పందులకు నిలయంగా తయారైంది. కోస్గి ఆస్పత్రి ఇంకా ప్రారంభించలేదు. కొడంగల్ ఆస్పత్రిలో సదుపాయాలలేమి రోగులకు ఇబ్బందిగా మారింది. ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ విపక్షం ఆరోపిస్తోంది. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్న కేటీఆర్‌..ఆ స్థాయిలో అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ సారి కొడంగల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా ఉంటుందనే చర్చ అప్పుడే మొదలైంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన రేవంత్‌‎రెడ్డి, ఈసారి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అప్పుడు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే, ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా హోదాలో బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంతోపాటు కొడంగల్‎పైనా దృష్టి పెట్టారు రేవంత్‎రెడ్డి. వరుసగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్‌ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా కమిటీలు పటిష్టం చేసుకుంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తాను సెంటిమెంట్‌గా భావించే మదనపల్లి నుంచే హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమాన్ని రేవంత్‎రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎన్నికల ప్రచారం మాదిరిగా సాగింది. రేవంత్‎రెడ్డి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్టేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఈసారి కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరోవైపు కొడంగల్‎ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తిరుగులేని నాయకుడిగా ఉన్న గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‎రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప కొందరు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్‎లో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‎రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన గుర్నాథ్‎రెడ్డి..తాజాగా కాంగ్రెస్‎లో చేరడం ఇక్కడి రాజకీయాల్లో పెద్ద మార్పేనని చెప్పుకోవచవ్చు. గతంలో రేవంత్‌‎రెడ్డి చేతిలో రెండుసార్లు వరుసగా ఓటమిపాలైన..గుర్నాథ్‌రెడ్డి ఇప్పుడదే రేవంత్‌రెడ్డితో చేతులు కలుపడం ఆసక్తికరంగా మారింది. ఈ కలయిక వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది కీలకమైన అంశం. ఆయన చేరిక కలిసొస్తుందని, అదనపు బలంతో ఈసారి కొడంగల్ స్థానంలో గెలుపు తథ్యమని కాంగ్రెస్ భావిస్తోంది.

మరోవైపు బీఆర్ఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పట్నం నరేందర్‎రెడ్డి సామాజిక వర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించానని ఎమ్మెల్యే పట్నం నరేందర్‎రెడ్డి చెబుతున్నారు. కచ్చితంగా మరోసారి కొడంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఎమ్మెల్యే నరేందర్‎రెడ్డి ఉన్నారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‎రెడ్డి..నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేసి.. మళ్లీ కాంగ్రెస్‌ని గెలిపించాలంటూ కొడంగల్‌లో తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. రేవంత్‎రెడ్డి తనపై పోటీ చేస్తే..తన గెలుపు ఇంకా సులువు అవుతుందని పట్నం నరేందర్‎రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇంకా కొడంగల్ ప్రజలు రేవంత్‌‎రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరని.. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసురుతున్నారు.

ఈసారి కొడంగల్ సీటుపై కన్నేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపుకోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నాయి. కొడంగల్‌లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పట్నం నరేందర్‎రెడ్డి 9 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్‎రెడ్డి గెలుపొందారు. మరి, ఈసారి కూడా కారు దూకుడు కొనసాగుతుందా? హస్తవాసి మారి.. రిజల్ట్‌ తారుమారవుతుందా? అన్నదే తెలియాల్సి ఉంది. ఎవరి వాదన ఎలా ఉన్నా తుది నిర్ణయం తీసుకునేది కొడంగల్‌ ఓటర్లే. ఈసారి విజేత ఎవరో తెలియాలంటే ఎన్నికలయ్యే దాకా ఆగాల్సిందే.

Updated On 14 Oct 2023 8:15 AM GMT
Ehatv

Ehatv

Next Story