Telangana 2023 Poll Timings : ఆ నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
సరిగ్గా మరో నెల రోజులు. వచ్చే నెల ఈ పాటికి తెలంగాణలో(Telangana) పోలింగ్(Polling) జరుతుంటుంది. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం అయిదు గంటల వరకు కొనసాగుతుంది.

Telangana 2023 Poll Timings
సరిగ్గా మరో నెల రోజులు. వచ్చే నెల ఈ పాటికి తెలంగాణలో(Telangana) పోలింగ్(Polling) జరుతుంటుంది. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం అయిదు గంటల వరకు కొనసాగుతుంది. అయిదు గంటల తర్వాత క్యూ లైన్‌లో ఉన్న వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే సిర్పూర్(Sirpur), చెన్నూర్(Chennur), బెల్లంపల్లి(Bellampally), మంచిర్యాల(Manchiryala), ఆసిఫాబాద్(Asifabad), మంథని(Manthani), భూపాలపల్లి(Bhupalapally), ములుగు(Mulugu), పినపాక(Pinapaka), ఇల్లందు(Ellandu), కొత్తగూడెం(Kothagudem), అశ్వరావుపేట(Aswaraopet), భద్రాచలం(Badrachalam) నియోజకవర్గాలలో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ఉంటుంది. మిగతా 106 స్థానాలలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
