తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది

తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. ఉదయం గం.8.40 వరకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో బీజేపీ ఐదు స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి నగేశ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌లు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ముందంజలో ఉన్నారు.

దేశమంతా హైదరాబాద్ లోక్ సభ స్థానం వైపు చూస్తోందని బీజేపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. హైదరాబాద్ స్థానంలో గెలిచి ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. ఎన్నికలు న్యాయంగా జరిగితే భారీ మెజార్టీతో గెలిచేవాళ్లమని... కానీ అన్యాయంగా జరిగాయన్నారు. హైదరాబాద్ లోక్ సభ అన్యాయం నుంచి బయటపడాలంటే తాను గెలవాలన్నారు.

Updated On 3 Jun 2024 9:55 PM GMT
Yagnik

Yagnik

Next Story