రాత్రి టెంపరేచర్లు ఏడు జిల్లాల్లో 15 డిగ్రీలకన్నా తక్కువగా నమోదయ్యాయి.
రాత్రి టెంపరేచర్లు ఏడు జిల్లాల్లో 15 డిగ్రీలకన్నా తక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్(Adilabad), కుమ్రంభీం ఆసిఫాబాద్(Komarambheem), నిర్మల్(Nirmal), కామారెడ్డి(Kama reddy), సంగారెడ్డి(sanga reddy), వికారాబాద్(Vikarabad), మెదక్(MEdak) జిల్లాల్లో చలి ప్రభావం(Cold) కనిపించింది. అత్యల్పంగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్లో 12.6 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 13.2, ఆదిలాబాద్ జిల్లా బేలలో 13.3, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 13.9, నిర్మల్ జిల్లా పెంబిలో 14.3, మెదక్ జిల్లా బోడగట్టులో 14.8, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 15 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మిగతా అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకన్నా ఎక్కువగా నమోదయ్యాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 20 డిగ్రీలకుపైగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. అత్యధికంగా సూర్యాపేటలో 21.6 డిగ్రీలు రికార్డయింది. నిరుడు ఇదే రోజుతో పోలిస్తే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు.. 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీలో రెండు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలవరకు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నది.