తెలంగాణ‌లో(Telangana) నేరాల‌ వార్షిక నివేదికను(Annual Crime Report) డీజీపీ రవి గుప్తా(DGP Ravi Guptha) శుక్ర‌వారం విడుదల చేశారు. ఆయ‌న మీడియాతో(Media) మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ప్రశాంతంగా నిర్వహించామన్నారు. పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 8. 97% క్రైమ్ రేటు పెరిగిందన్నారు.

తెలంగాణ‌లో(Telangana) నేరాల‌ వార్షిక నివేదికను(Annual Crime Report) డీజీపీ రవి గుప్తా(DGP Ravi Guptha) శుక్ర‌వారం విడుదల చేశారు. ఆయ‌న మీడియాతో(Media) మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ప్రశాంతంగా నిర్వహించామన్నారు. పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 8. 97% క్రైమ్ రేటు పెరిగిందన్నారు. ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదు చేశామని వెల్ల‌డించారు. అలాగే గత ఏడాది తో పోలిస్తే 17. 59% సైబర్ క్రైమ్(Cyber Crime) నేరాలు పెరిగిపోయాయని వివ‌రించారు. ఈ ఏడాది 1,108 జీరో FIR లు నమోదు చేసిన‌ట్లు తెలిపారు. ఈ ఏడాది ఐపీసీ కింద కేసులు 1,38,312 కేసులు నమోదయ్యాయని వెల్ల‌డించారు. రేప్ కేసులలో(Rape Cases) 73 కేసుల్లో 84 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని వివ‌రించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,360 డ్రగ్, ఎన్డీపీఎస్‌ కింద కేసులు నమోదు కాగా.. గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది 15.6 % డ్రగ్స్ కేసులు పెరిగాయని వెల్ల‌డించారు. 25,260 కేజీల గంజాయి, 1,240 గంజాయి మొక్కలను సీజ్ చేసి 2,583 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు 1,877 కేసులు నమోదు కాగా.. మహిళలపై వేధింపులు 19,013 కేసులు నమోదైన‌ట్లు వివ‌రించారు. ఇందులో 2,284 కేసులు రేప్ కేసులు, 33 వరకట్న, హత్యలు, 132 వరకట్న మరణాలు, 9,458 వరకట్న వేధింపులు, మహిళా హత్యలు 213, 884 మహిళ కిడ్నాప్ లు నమోదయ్యాయ‌ని తెలిపారు.ఈ ఏడాది పొక్సో కేసులు 2,426 న‌మోదుకాగా, పొక్సో చ‌ట్టం కింద‌ ఒక నిందితుడ కి మరణ శిక్ష విధింపు, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని వివ‌రించారు.

యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ కేసుల‌లో 182 మంది అరెస్ట్ చేసి.. 7.99 కోట్లు సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. 536 మందికి పునరావాసం కల్పించామ‌ని పేర్కొన్నారు. 32 మంది డ్రగ్స్ నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసిన‌ట్లు వివ‌రించారు. ఎన్డీపీఎస్‌ యాక్ట్ కింద‌ 12 మంది విదేశీయులను కూడా అరెస్ట్ చేసిన‌ట్లు వివ‌రించారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 20, 699 కేసులు న‌మోద‌వ‌గా.. ఈ ప్ర‌మాదాల‌లో 6,788 మంది మృతి చెంద‌గా.. 19,137 మంది గాయాలపాల‌య్యార‌ని వివ‌రించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కింద‌ 287 కేసులు న‌మోద‌వ‌గా.. 557 మంది భాదితులను రెస్క్యూ చేపిన‌ట్లు వివ‌రించారు. 364 మంది ట్రాఫికర్స్ ను అరెస్ట్ చేశామ‌ని తెలిపారు.

Updated On 29 Dec 2023 5:15 AM GMT
Ehatv

Ehatv

Next Story