తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నేడు తెలంగాణ ర‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్య‌ర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ రన్’ నిర్వహించ‌నున్నారు.

తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల(Telangana Decade Celebrations)ను పురస్కరించుకొని నేడు తెలంగాణ ర‌న్(Telangana Run) కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర పోలీస్(State Police) శాఖ ఆధ్య‌ర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ రన్’ నిర్వహించ‌నున్నారు. ఈ రన్ లో యువత, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొననున్నారు.

హైద్రాబాద్ కేంద్రంగా 2K, 5K తెలంగాణా రన్ లను రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ(Mohammad Ali), శ్రీనివాస్ యాదవ్(Srinivas Yadav), శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి(Gadwal Vijayalaxmi), ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanthi Kumar), డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) లు జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్రముఖ క్రీడాకారులు నిఖత్ జరీన్(Nikhat Zareen), ఈషా సింగ్(Esha Singh), సింగర్ మంగ్లీ(Mangli), సినీ నటి శ్రీ లీల(Sree Leela) లు హాజరయ్యారు. మంగ్లీ, రామ్(Ram) లు తమ హుషారైన‌ పాటలతో రన్నర్లలో ఉత్సాహాన్ని నింపారు.

Updated On 11 Jun 2023 9:06 PM GMT
Yagnik

Yagnik

Next Story