ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌(World Boxing Championship)లో 50 కిలోల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌(Nikhat Zareen)ను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి(Santhi Kumari), డీజీపీ అంజనీకుమార్‌(DGP Anjani Kumar) అభినందించారు. బీఆర్‌కే భవన్‌(BRK Bhavan)ను సీఎస్‌(CS)ను నిఖత్‌ జరీన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరీన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌(World Boxing Championship)లో 50 కిలోల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌(Nikhat Zareen)ను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి(Santhi Kumari), డీజీపీ అంజనీకుమార్‌(DGP Anjani Kumar) అభినందించారు. బీఆర్‌కే భవన్‌(BRK Bhavan)ను సీఎస్‌(CS)ను నిఖత్‌ జరీన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరీన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. తెలంగాణ ఖ్యాతిని నిఖత్‌ జరీన్‌ ప్రపంచపటంలో నిలిపిందని సీఎస్‌ శాంతికుమారి(CS Santhi Kumari) ప్రశంసించారు. ఈ గెలుపుతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెల్చుకున్న రెండో భారతీయ బాక్సర్‌గా జరీన్‌ చరిత్ర సృష్టించిందని డీజీపీ అన్నారు. యువ క్రీడాకారులకు జరీన్ ఆదర్శవంతంగా నిలిచిందని అంజనీకుమార్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు పాల్గొన్నారు.

Updated On 6 April 2023 5:00 AM GMT
Ehatv

Ehatv

Next Story