ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ధరణి పోర్టల్ సమస్యలపై పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో పైలెట్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ నాయకులు జైరాం రమేష్ హాజరుకానున్నరు.

అనేక సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఎంతో మంది రైతులు ధరణి పోర్టల్ సమస్యలపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లభించటం లేదు. దీంతో రైతులు, భూ యజమానులు పడుతున్న ఆవేదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఇందులో భాగంగానే 10 తేది నుండి గ్రామ, గ్రామాన ధరణి పోర్టల్ అదాలత్ పేరుతో భూసమస్యలపై ఫిర్యాదులు, ఇబ్బందులను తెలుసుకునేందుకు ముందుకు కదులుతున్నారు.
ధరణి పోర్టల్ లో రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షలకు పైగా ఇబ్బందులు నెలకొన్నట్లు గణాకాంలు చెపుతున్నాయి. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇప్పటికీ పరిష్కారం దొరక్కపోగా తమ భూముల కోసం తామే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరణి పోర్టల్ దిద్దుబాటులో ఇబ్బందులు రైతుల కంట రక్త కన్నీరు తెప్పిస్తోంది. సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు అనేక సార్లు ధరణిపై సమావేశాలు నిర్వహించినా పరిష్కారం మాత్రం కాలేదు. అనేక సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌లో మాడ్యూళ్లే లేవని భూనిపుణులు చెపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించిన కాంగ్రెస్ దీనిపై అదాలత్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి వేదికను ఏర్పాటు చేసింది.
ధరణి పోర్టల్ అదాలత్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నుండి ధరణి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనుంది. స్వీకరించిన ఫిర్యాదులు, మెమరాండంలను గ్రామసభల ద్వారా ధరణి ఫోర్టల్ ద్వారా రైతులు, సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారంపై పోరాడనుంది. ఈ గ్రామసభ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ధరణి ఫోర్టల్ సమస్యల పరిష్కారానికి వినతులు, మెమరాండాలు స్వీకరించి ప్రభుత్వంతో పోరాడేందుకు కాంగ్రెస్ పోరుబాట పట్టనుంది.