గాంధీభవన్ పీఈసీ సమావేశంలో దరఖాస్తుదారుల ఎంపిక కోసం వారి పూర్తి వివరాలను పరిశీలించడం జరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
గాంధీభవన్(Gandhi Bhavan) పీఈసీ సమావేశం(PEC Meeting)లో దరఖాస్తుదారుల ఎంపిక కోసం వారి పూర్తి వివరాలను పరిశీలించడం జరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. కాంగ్రెస్ పార్టీ(Congress)తో దరఖాస్తుదారులకు అనుబంధం, పార్టీ లో చేరిన తేదీ, దరఖాస్తు చేసుకున్న తేదీ, పాల్గొన్న పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్యక్రమాలు చేపట్టిన అంశాలకు సంబంధించి దరఖాస్తులో పొందుపరచిన అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు.
ఈ నివేదికలను గాంధీభవన్ లో సెప్టెంబర్ 2న జరుగనున్న పిఏసి సమావేశం(PAC Meeting)లో చర్చిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 4న స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్ మురళీధరన్(Screening Committee Chairman Muralidharan), సభ్యులు బాబా సిద్ధికి(Baba Siddiqui), జీగ్నేష్ మేవానీ(Jeignesh Mevani)లు హైదరాబాద్(Hyderabad) వస్తారని తెలిపారు. 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండి రాష్ట్రంలోని అన్ని రకాల నాయకత్వంతో మాట్లాడి నివేదికలు రూపొందిస్తారని పేర్కొన్నారు.
ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) లకు తొలి జాబితాలో టిక్కెట్లు కేటాయించాలని పీఈసీ నిర్ణయం తీసుకుందని.. సీట్లు ముందుగా ఇవ్వాలని సమావేశంలో చర్చించడం జరిగిందని వివరించారు. పీఈసీ సమావేశంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి(Revanth Reddy).. సీడబ్ల్యూసీ తొలి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కి లేక రాయాలని తీర్మానించారని తెలిపారు.
మొత్తం 119 నియోజకవర్గం వర్గాల నుండి 1006 దరఖాస్తులు వచ్చాయని.. ఇల్లందు నియోజకవర్గం(Yellandu Constituency) నుంచి అత్యధికంగా 38 దరఖాస్తులు(Applications) వచ్చాయని వెల్లడించారు. కొడంగల్(Kodangal), జగిత్యాల(Jagityal) నియోజకవర్గాల నుంచి కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయని తెలిపారు.