తెలంగాణ శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అలాగే గవర్నర్‌ కోటాలో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో భర్తీ కానున్నాయి. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి(Kasireddy Narayan Reddy) కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.

తెలంగాణ శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అలాగే గవర్నర్‌ కోటాలో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో భర్తీ కానున్నాయి. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి(Kasireddy Narayan Reddy) కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తే, కడియం శ్రీహరి స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానం నుంచి గెలుపందారు. ఇక నల్లొండ, వరంగల్‌, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2027 మార్చి వరకు పదవీకాలం ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడియం శ్రీహరి పదవీకాలం కూడా 2027 నవంబర్‌ వరకు ఉంది. ఖాళీ అవుతున్న ఈ ఆరు స్థానాల కోసం చాలా మంది రేసులో ఉన్నారు. షబ్బీర్‌ అలీ, అద్దంకి దయాకర్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి తీన్మార్‌ మల్లన్న(Teenmar Mallanna)పై ఉంది. ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయవచ్చని అంటున్నారు. ఇంతకు ముందు వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పోటీ చేసి సెంటర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌ అయ్యారు. ఓట్ల పరంగా రెండోస్థానంలో నిలిచారు. విజేతగా నిలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చుక్కలు చూపించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న స్పష్టమైన హామీతోనే మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు మల్లన్నకు నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం టికెట్‌ గ్యారంటీ అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్న 18 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈయన ప్రచారం చేసిన అన్నిచోట్లా కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అవసరమైతే మల్లన్నకు ఎమ్మెల్యే కోటాలలో కూడా అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. సీపీఐకి హామీ ఇచ్చిన ప్రకారం రెండు ఎమ్మెల్సీలు ఇవ్వాలి. ఇందులో ఒక సీటు గవర్నర్‌ కోటాలో కోరుతున్నదా పార్టీ. తమకు అండగా నిలిచిన మేధావులు, ప్రజా సంఘాల నాయకులను కూడా కాంగ్రెస్‌ పార్టీ సర్దుబాటు చేయాల్సి ఉంది.

Updated On 6 Dec 2023 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story