ప్రజల కోసం ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka) అన్నారు. తెలంగాణ(Telangana) ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లా(Khammam District)లోకి అడుగు పెడుతుంటుంటే.. బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) తట్టుకోలేక ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి నిర్భందిస్తున్నారని అన్నారు.
ప్రజల కోసం ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka) అన్నారు. తెలంగాణ(Telangana) ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లా(Khammam District)లోకి అడుగు పెడుతుంటుంటే.. బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) తట్టుకోలేక ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి నిర్భందిస్తున్నారని అన్నారు. బస్సులు రాకుండా.. బస్సులివ్వకుండా.. ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా.. చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం ఇది అత్యంత హేయమైనా చర్య అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో కార్యకర్తలుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఈరోజు పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని మా సభను అడ్డుకోవాలని చూస్తున్నారని.. దీన్ని తెలంగాణ సమాజం ఖండించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులారా ఇది పద్ధతి కాదు.. చేతిలో మీ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబడ్ధార్ అని హెచ్చరించారు. తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజలు కట్టే పన్నులతో వచ్చే జీతంతో మీరు డ్యూటీలు చేస్తున్నారు.. మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి రావట్లేదన్నారు.
అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి.. నీతింగా వ్యవహరించండి.. పోలీసులు ఒక పార్టీకి తోత్తులుగా మారి మా పార్టీ మీటింగ్ ను విచ్చినం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలీసులను తోసుకుంటూ.. తరుముకుంటూ.. ముందుకు రావాలని ప్రజలకు, కార్యకర్తలకు సీతక్క విజ్ఞప్తి చేశారు.