పీఏసీ(PAC) సమావేశంలో మూడు తీర్మానాలు చేశామ‌ని మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir ali) తెలిపారు. గాంధీ భవన్ లో జ‌రిగిన పీఏసీ సమావేశానికి సంబంధించి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పీఏసీలో కీలక నిర్ణయం తీసుకున్నామ‌ని.. తెలంగాణలో సోనియా గాంధీ(Sonia Gandhi) పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామ‌ని వెల్ల‌డించారు. గతంలో ఇందిరా గాంధీ (Indira Gandhi)మెదక్ నుంచి పోటీ చేశారని.. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీకి ఋణపడి ఉంటామ‌ని తెలిపారు.

పీఏసీ(PAC) సమావేశంలో మూడు తీర్మానాలు చేశామ‌ని మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali) తెలిపారు. గాంధీ భవన్ లో జ‌రిగిన పీఏసీ సమావేశానికి సంబంధించి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పీఏసీలో కీలక నిర్ణయం తీసుకున్నామ‌ని.. తెలంగాణలో సోనియా గాంధీ(Sonia Gandhi) పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామ‌ని వెల్ల‌డించారు. గతంలో ఇందిరా గాంధీ (Indira Gandhi)మెదక్ నుంచి పోటీ చేశారని.. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీకి ఋణపడి ఉంటామ‌ని తెలిపారు.

ఆరు గ్యారంటీలపై పీఏసీలో చర్చించామ‌ని.. మిగిలిన గ్యారంటీలపై అసెంబ్లీలో(Assembly) సీఎం ప్రకటిస్తారని వెల్ల‌డించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాగపూర్ లో(Nagpur) 28న జరుగుతుంది. యాభై వేల మందిని తరలిస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభ్యులకు డిప్యూటీ సీఎం(Deputy CM) వివరించారని.. ఇరిగేషన్ అవకతవకలపై ఉత్తమ్ వివరించారని తెలియ‌జేశారు.

ఎలక్ట్రిసిటీ, ఫైనాన్స్(Finance), సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రజలకు వివరిస్తామ‌ని తెలిపారు. రేషన్ కార్డులు(Ration cards), పెన్షన్లు, హౌసింగ్ పై త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఈ నెల 28 నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ ఉంటుంద‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. గ్రామ సభలో లబ్దిదారుల ఎంపిక ఉంటుంద‌ని వివ‌రించారు. పార్లమెంట్(Parliament) స్థానాలకు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించామ‌ని తెలిపారు. నామినేటెడ్ పోస్టులను త్వ‌ర‌లోనే భర్తీ చేస్తామని సీఎం చెప్పారని షబ్బీర్ అలీ తెలిపారు.

Updated On 18 Dec 2023 6:09 AM GMT
Ehatv

Ehatv

Next Story