తెలంగాణలో(Telangana) యువతకు కాంగ్రెస్ సర్కార్(congress Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం(Free bus) కల్పిస్తు్న్న ప్రభుత్వం..తాజాగా యువతకు ఉచితంగా స్కూటీస్(Free Scooty) అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన యువతులందరూ అర్హులేనంట. గత ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తమ మేనిపోస్ట్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో(Telangana) యువతకు కాంగ్రెస్ సర్కార్(Congress Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం(Free bus) కల్పిస్తు్న్న ప్రభుత్వం..తాజాగా యువతకు ఉచితంగా స్కూటీస్(Free Scooty) అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన యువతులందరూ అర్హులేనంట. గత ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తమ మేనిపోస్ట్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే..ఆరు నెలల్లోపే చదువుకునే యువతులకు స్కూటీస్ అందిస్తామని వాగ్ధానం చేసింది. కాగా, త్వరలోనే ఫ్రీగా ఎలక్ట్రికల్ స్కూటీస్(Electric Scooty) అందిచేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎలా ధరఖాస్తు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికి కావాల్సిన డాక్యూమెంట్స్ 1.ఆధార్ కార్డు 2.పాన్ కార్డు 3. పాస్‌పోర్ట్ సైజు ఫొటో 4. అడ్రస్ ప్రూఫ్ 5. ఆదాయ ధృవీకరణ పత్రం 6. కుల ధృవీకరణ పత్రం 7. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. వీటన్నింటినీ దగ్గర ఉంచుకుని..ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ (https://telangana.gov.in)లోకి వెళ్లాలి. హోంపేజీలో త్వరలోనే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంచనున్నారు. అప్పుడు స్కూటీ స్కీం ధరఖాస్తు విధానం క్లిక్ చేయగానే, దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో మన వ్యక్తిగత వివరాలు, చిరునామా ఎంటర్ చేయాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కి, ధరఖస్తు చేయాలి. ఆ తర్వాత సంబంధిత అధికారులు ధరఖాస్తులను పరిశీలిస్తారు. అర్హతలు, పత్రాలను పరిశీలించి, అన్నీ సరిగానే ఉన్నాయని నిర్ధారించుకున్నాక..వారిని అర్హులుగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అర్హులుగా ఎంపికైన యువతులకు స్కూటీలను అందజేస్తారు.