తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల భృతిని అందిస్తామని ప్రియాంకగాంధీ విడుదల చేసిన డిక్లరేషన్‌లో వెల్లడించారు. ఖమ్మం, ఆదిలాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలలో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పింది కాంగ్రెస్‌ పార్టీ. ఆర్టీసీ, పోలీసు సిబ్బంది పిల్లలకు వరంగల్‌, హైదరాబాద్‌లలో విశ్వ విద్యాలయాలను, బాసర ట్రిపుల్‌ ఐటీ తరహాలో మరో నాలుగు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల భృతిని అందిస్తామని ప్రియాంకగాంధీ విడుదల చేసిన డిక్లరేషన్‌లో వెల్లడించారు. ఖమ్మం, ఆదిలాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలలో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పింది కాంగ్రెస్‌ పార్టీ. ఆర్టీసీ, పోలీసు సిబ్బంది పిల్లలకు వరంగల్‌, హైదరాబాద్‌లలో విశ్వ విద్యాలయాలను, బాసర ట్రిపుల్‌ ఐటీ తరహాలో మరో నాలుగు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ప్రతి ఏడాది జూన్‌ 2వ తేదీన ఉద్యోగాల నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని, సెప్టెంబర్‌ 17వ తేదీన నియామక పత్రాలను అందిచేస్తామని డిక్లరేషన్‌లో తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు నెలకు 25 వేల రూపాయల పెన్షన్‌ ఇస్తామని, యువకులకు పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది. విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందిస్తామని డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ పేర్కొంది.

Updated On 8 May 2023 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story