తెలంగాణ కాంగ్రెస్ గురువారం కొత్త లోక్‌సభ ఎన్నికల యాడ్ విడుదల చేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసింది. ప్రధాని నేతృత్వంలోని కేంద్రం ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని..

Telangana Congress’ ‘donkey egg’ ad targets PM Modi
తెలంగాణ కాంగ్రెస్ గురువారం కొత్త లోక్‌సభ ఎన్నికల యాడ్ విడుదల చేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసింది. ప్రధాని నేతృత్వంలోని కేంద్రం ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.
ప్రధానమంత్రిని "ఢిల్లీ దర్బార్" నడుపుతున్న రాజుగా చిత్రీకరిస్తూ.. దేశంలోని పన్నుల వసూళ్లకు రాష్ట్రం సహకరిస్తున్నప్పటికీ..తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఆ ప్రకటన ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. ప్రకటనను ఢిల్లీ దర్భార్ పేరుతో విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో వీడియోను షేర్ చేస్తూ క్రింది విధంగా రాసుకొచ్చింది.
సొమ్ము ఒకరిది - సోకు ఒకరిది అంటే ఇదేనేమో
తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని, గుజరాత్ కు అప్పనంగా అప్పజెబుతుంది ఢిల్లీ దర్బార్.
తెలంగాణ అడిగింది…
పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా
బీజేపీ ఇచ్చింది…
“గాడిద గుడ్డు”తెలంగాణ అడిగింది…
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.
బీజేపీ ఇచ్చింది…
“గాడిద… pic.twitter.com/ZWp2wDPZT8— Telangana Congress (@INCTelangana) May 2, 2024
