తెలంగాణలో కాంగ్రెస్ నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 11 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి .
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy)తోపాటు 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 11 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి .
డిప్యూటీ సీఎం హోదాలో మల్లు భట్టి విక్రమార్కకు కీలకమైన రెవిన్యూ శాఖను పర్యవేక్షించనున్నారు. ఇక..సీఎం పదవి కోసం చివరి వరకు రేసులో నిలిచిన ఉత్తమ్ కుమార్‌రెడ్డికి హోంశాఖను ఖరారు చేసారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్, ఐటీ శాఖలను కేటాయిస్తూ నిర్ణయించారు. వైఎస్ హయాంలోనూ ఐటీశాఖ మంత్రిగా పని చేసిన అనుఢవం కోమటిరెడ్డికి ఉంది. ఇక మరో కీలక నేత దామోదర రాజనర్సింహకు వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. ఇక గతంలో మంత్రిగా పలుశాఖలు నిర్వహించిన మంత్రిగా పని చేసిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖ ఖరారైంది. ఇక, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటికి ఇరిగేషన్ శాఖను ఖరారు చేసారు. అంత్యంత కీలకమైన ఆర్దిక శాఖతో పాటు అసెంబ్లీ వ్యవహారాలను శ్రీధర్ బాబుకు ఖరారు చేస్తూ నిర్ణయించారు. జూపల్లికి గతంలో నిర్వహించిన పౌర సరఫరాలను తిరిగి కేటాయించారు. తొలి సారి మంత్రి అయిన సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ ఖరారు అయింది. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమశాఖ..కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలను అప్పగించారు.
11 మంది మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేః
డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి - భట్టి విక్రమార్క
హోం మంత్రి- ఉత్తమ్ కుమార్‌రెడ్డి
మున్సిపల్ శాఖ మంత్రి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆర్థికశాఖ మంత్రి - డి.శ్రీధర్‌బాబు
నీటి పారుదలశాఖ మంత్రి - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మహిళా సంక్షేమశాఖ మంత్రి - కొండా సురేఖ
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి - దామోదర రాజనర్సింహ
పౌరసరఫరాలశాఖ మంత్రి - జూపల్లి కృష్ణారావు
బీసీ సంక్షేమశాఖ మంత్రి - పొన్నం ప్రభాకర్
గిరిజన సంక్షేమశాఖ మంత్రి - సీతక్క
రోడ్లు, భవనాల శాఖ మంత్రి - తుమ్మల నాగేశ్వరరావు