రెడ్ జోన్‌లో 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సర్వేలో తేలింది.

రెడ్ జోన్‌లో 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సర్వేలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా థర్డ్ పార్టీ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విభాగాలపై సర్వే చేయించిన రేవంత్ రెడ్డి

ఈ సర్వేలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పనితీరు, జిల్లా లేదా స్థానిక స్థాయిలో పరిపాలన, ప్రజల ఆశయాలపై దృష్టి పెట్టారు. అయితే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్‌, 14 మంది ఆరెంజ్ జోన్‌లో మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్లడించాయి. సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినందుకు విమర్శలను ఎదుర్కొంటున్నారు. రెడ్ జోన్‌లో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సందర్శించకుండా, హైదరాబాదులో ఎక్కువ సమయం గడుపుతున్నారని.. వారు వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. వీరిలో 8 నుంచి 10 మంది ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పంక్తులు కలిగించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడి. ఆరెంజ్ జోన్‌లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.

ehatv

ehatv

Next Story