తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలును ప్రారంభించింది. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత బస్సు(Free bus) ప్రయాణణాన్ని మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆరోగ్య శ్రీ(Aarogya Shri) పరిధిని రూ.10 లక్షలకు పెంచారు. రేషన్ కార్డు కలిగి ఉండి 200 యూనిట్ల విద్యుత్‌ను వాడుతున్నవారికి జీరో బిల్లను అమలు చేస్తున్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించారు. ప్రజపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలను అమలు చేస్తున్నారు.

అయితే ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్‌ను(aasara pension scheme) 4 వేలకు పెంచుతామన్న ప్రధాన హామీని కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్(CM Revanth Reddy) పదేపదే చెప్పారు. త్వరలోనే ఈ పథకాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే ఈ పెన్షన్ పెథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలుస్తోంది. అలాగే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం. వీలైనంత త్వరలో లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారట. ఎంపీ ఎన్నికల్లోపే పెన్షన్‌ను 4 వేలకు పెంచి లబ్ధిదారులకు అందిస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. మరోవైపు వృద్ధులు, వితంతువులు కూడా పెన్షన్ పెంచడంపై ఎదురుచూస్తున్నారు. ఎన్నికలైన మరుసటి నెల నుంచే ఆసరా పెన్షన్ పెంచుతామని రేవంత్ చెప్పడంతో ఏకపక్షంగా కాంగ్రెస్‌కు ఓట్లేశామని.. తర్వగా పెన్షన్ పెంచి ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వృద్ధులు కోరుతున్నారు.