తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తప్పకుండా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేసారు. అయితే తర్వాతి సీఎం ఎవరనే విషయంపై మాత్రం ఆయన స్పష్టంగా ఓ పేరు చెప్పలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో కలిసి పని చేస్తానని చెప్పారు. తనకు ఎవరితోనూ సమస్య ఉండదని, తెలంగాణ ప్రయోజనాలే తనకు ప్రధానమని స్పష్టం చేశారు. కడప లోక్ సభ స్థానంలో వైఎస్ షర్మిల గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
రాష్ట్రంలోని 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 12-13 స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పని అయిపోయిందని, 6-7 నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కవని ఆయన అంచనా వేశారు. ఇక తెలంగాణలో పాలన గురించి తాను దృష్టి పెడతానని రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాలు హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ కు క్రమం తప్పకుండా వచ్చేలా చేస్తామన్నారు. ఫార్మా విలేజ్ లతో పొల్యూషన్ కంట్రోల్ చేయడం సులభమని అన్నారు. మెట్రోను ఎల్ అండ్ టీ అమ్ముకుంటే.. అమ్ముకోని మేము చేసేది ఏముంటుంది? వాళ్ల ఆస్తి వాళ్లు అమ్ముకుంటే చేసేదేముంటుందని అన్నారు రేవంత్ రెడ్డి.