2019లో కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను 27 సీట్లు బీజేపీ గెలుచుకుంది.. ఇప్పుడు అక్కడ

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే 214 నుంచి 240 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈసారి 400 సీట్లు దాటుతాయని బీజేపీ భావిస్తూ ఉండగా.. అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం రాత్రి ఆప్ కీ అదాలత్‌ షోలో రజత్ శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2019లో బీజేపీ 303 సీట్లు గెలుచుకున్నప్పుడు, ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్‌లలో కలిపి 95 శాతం సీట్లు గెలుచుకుందని అన్నారు. ఈసారి 400 సీట్లు గెలవాలంటే, పాకిస్తాన్‌లో కూడా ఎన్నికలలో గెలవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

2019లో కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను 27 సీట్లు బీజేపీ గెలుచుకుంది.. ఇప్పుడు అక్కడ 12 సీట్లకు మించి గెలవలేదని అన్నారు. ఇక తెలంగాణలో 2 సీట్లకే పరిమితం అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో 119 స్థానాలకు గానూ 100 సీట్లు గెలుస్తామని బీఆర్‌ఎస్ కూడా కలలు కన్నదని, కానీ అసెంబ్లీలో కేవలం 39 సీట్లకే పరిమితమైందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 62 శాతం మంది యువత మోదీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల సృష్టి గురించి మాట్లాడిన ఆయన 7.5 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయలేకపోయారని విమర్శించారు. ఎవరికైనా జన్ ధన్ ఖాతాల్లోకి రూ.15 లక్షలు వచ్చాయా? రైతుల ఆదాయం రెండింతలు పెరిగిందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Updated On 13 April 2024 9:04 PM GMT
Yagnik

Yagnik

Next Story