KCR Wife Shobha Rao : శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి శోభా రావు
తెలంగాణ(Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) సతీమణి శోభా రావు(Shobha Rao) మంగళవారం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించిన అనంతరం అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు

KCR Wife Shobha Rao
తెలంగాణ(Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) సతీమణి శోభా రావు(Shobha Rao) మంగళవారం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించిన అనంతరం అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(Chevireddy Bhaskar Reddy) తదితరులు ఆమెకు ఆహ్వానం పలికి.. దగ్గరుండి శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శోభా రావుకు పండితులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం నిన్న సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ ఉదయం వారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తికి బయలుదేరి వెళ్లారు.
