ప్రొఫ్రెసర్ హరగోపాల్‌తో పాటు ఉపా (UAPA) చట్టం కింద 152 మందిపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖకు ముఖ్యమంత్(CM Office) కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. కేసులు తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(KChandra shekar rao) డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించినట్టు సమాచారం.
ప్రొఫ్రెసర్ హరగోపాల్‌తో పాటు ఉపా (UAPA) చట్టం కింద 152 మందిపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖకు ముఖ్యమంత్(CM Office) కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. కేసులు తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(KChandra shekar rao) డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించినట్టు సమాచారం. హరగోపాల్‌తో(Hara Gopal) పాటు 152 మందిపై ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు పెట్టిన మరుక్షణం నుంచే తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మేధావి వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద హరగోపాల్‌తో పాటు 152 మందిపైనా కేసు నమోదు చేశారు.
ప్రొఫెసర్ హరగోపాల్‌పై యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు పది సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయితే ఈ దేశద్రోహం కేసు ఆలస్యంగా ఇప్పుడు వెలుగు చూసింది. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రమౌళిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించారు. దాంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పుస్తకాలలో హరగోపాల్ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామం దగ్గర ఓ రోజు తెల్లవారుజామున మావోయిస్టులు సమావేశామవుతున్నారని పోలీసులకు వర్తమానం అందింది. పోలీసులు నిశ్శబ్దంగా కూంబింగ్ ఆపరేషన్ చేశారు. పోలీసుల కదలికలను గమనించిన మావోయిస్టులు అక్కడ్నుంచి తప్పించుకున్నారు.
ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేసినప్పుడు విప్లవ సాహిత్యం దొరికింది. ఆ పుస్తకాలలో ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వారందరిని నిందితులుగా చేర్చారు పోలీసులు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడైన పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ చేసినట్టు అభియోగం మోపారు పోలీసులు. మావోయిస్టు పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, యువతను పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్టు పోలీసులు కేసులు పెట్టారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో చంద్రమౌళితో పాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్, ముంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన సురేశ్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయ.